మరో రెండు సినిమాలకు ఓకే చెప్పిన నితిన్‌!

Friday, January 17, 2025

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ ప్ర‌స్తుతం రెండు సినిమాల్లో న‌టిస్తూ రిలీజ్ కు రెడీ అవుతున్నాడు. ద‌ర్శ‌కుడు శ్రీ‌రామ్ వేణు దర్శకత్వంలో ‘త‌మ్ముడు’ సినిమాలో న‌టిస్తున్న నితిన్.. మ‌రో ద‌ర్శ‌కుడు వెంకీ కుడుముల తెర‌కెక్కిస్తున్న ‘రాబిన్ హుడ్’ లో కూడా యాక్ట్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. ఒక సినిమాను ఈ సంవత్సరం చివ‌రినాటికి, మ‌రో సినిమాను వ‌చ్చే ఫిబ్ర‌వ‌రిలో విడుదల అయ్యేలా ప్లాన్ చేసుకుంటున్నాడు ఈ యంగ్‌ హీరో.

అయితే, రెండు సినిమాలు షూటింగ్ ద‌శ‌లో ఉండ‌గానే మ‌రో రెండు సినిమాల‌కు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేశాడు నితిన్. ‘ఇష్క్’ సినిమా ద‌ర్శ‌కుడు విక్ర‌మ్ కుమార్ తో నితిన్ త‌న నెక్ట్స్ ప్రాజెక్టును మొదలు పెట్టాలని చూస్తున్నాడు. అలాగే ‘#90s’ వెబ్ సిరీస్ ద‌ర్శ‌కుడు ఆదిత్య హాస‌న్ డైరెక్ష‌న్ లోనూ ఓ సినిమా చేసేందుకు నితిన్‌ రెడీ అయ్యాడు. ఇక ఈ రెండు సినిమాల షూటింగ్ ను ఒకేసారి పూర్తి చేయాల‌ని నితిన్ భావిస్తున్నట్లు సమాచారం.

కాగా, విక్ర‌మ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో నితిన్ న‌టించ‌బోయే సినిమాను ప్రైమ్ షో ఎంట‌ర్టైన్మెంట్స్ బ్యాన‌ర్ పై నిర్మాత కె.నిరంజ‌న్ రెడ్డి ప్రొడ్యూస్ చేయబోతున్నారు. ఈ ఏడాదిలోనే ఈ సినిమా షూటింగ్ ను ప్రారంభించాల‌ని మూవీ మేక‌ర్స్ భావిస్తున్నారు. మొత్తానికి నితిన్ వ‌రుస ప్రాజెక్టుల‌తో ఫుల్‌ బిజీగా మారుతున్నాడు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles