హరిహర వీరమల్లు పాట పై కొత్త అప్డేట్‌!

Wednesday, January 22, 2025

పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ హరిహర వీరమల్లు సినిమా షూటింగ్‌ ని మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. ఈ సినిమా మార్చి 28న, 2025న గ్రాండ్ గా విడుదల కాబోతుంది.మఅయితే, ఈరోజు ఈ సినిమా కొత్త షెడ్యూల్ షూటింగ్ ప్రారంభమైంది. ఈ సినిమాలోని కీలక తారాగణం ఈ షెడ్యూల్ లో పాల్గొనబోతున్నారు.

ఈ సినిమా నుంచి మొదటి సింగిల్‌ను విడుదల చేయడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తుంది. దీపావళి శుభ సందర్భంగా విడుదల చేయాలని చిత్ర బృందం ప్లాన్‌ చేస్తుంది. ఇందుకు సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ పాట తెలుగు వెర్షన్‌కు పవన్ కళ్యాణ్ స్వయంగా తన గొంతుని ఇచ్చిన సంగతి తెలిసిందే.

కాగా డైరెక్టర్ జ్యోతి కృష్ణ డైరెక్షన్‌ లో ఈ మూవీ రానుంది. ఈ సినిమాలో నిధి అగర్వాల్ తో పాటు బాబీ డియోల్, సునీల్, రఘుబాబు, సుబ్బరాజు,  నోరా ఫతేహి ప్రధాన పాత్రల్లో యాక్ట్‌ చేస్తున్నారు. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎ దయాకర్ రావు నిర్మిస్తున్న ఈ సినిమాకి ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి సంగీతం అందిచారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles