తండేల్‌ రాజుగా చైతూ కొత్త పోస్టర్‌!

Wednesday, December 25, 2024

అక్కినేని నాగచైతన్య నటిస్తున్న తాజా సినిమా ‘తండేల్’ గురించి ప్రేక్షకులు ఏ రేంజ్‌లో వెయిట్ చేస్తున్నారో అందరికీ తెలిసిన విషయమే. ఈ సినిమాను దర్శకుడు చందు మొండేటి రూపొందిస్తుండడంతో ఈ మూవీపై అంచనాలు ఓ రేంజ్‌ కు చేరుకున్నాయి.

ఇక ఈ సినిమా నుండి తాజాగా విడుదలైన ‘బుజ్జి తల్లి’ సాంగ్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే, నాగచైతన్య పుట్టినరోజు సందర్భంగా తాజాగా ఈ సినిమా నుంచి తండేల్ రాజు పాత్రకు సంబంధించి ఓ సరికొత్త పోస్టర్‌ని ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చారు.

ఈ పోస్టర్‌లో చైతూ లుక్స్ చాలా సీరియస్‌గా కనిపిస్తుండటంతో ప్రేక్షకులు ఈ సీన్ యాక్షన్ సీక్వెన్స్‌కి సంబంధించి ఉంటుందని భావిస్తున్నారు.ఈ సినిమాలో అందాల ముద్దుగుమ్మ, నేచురల్‌ బ్యూటీ  సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తుండటంతో ఈ సినిమా పై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. ఇక ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా, బన్నీ వాస్ ఈ చిత్రాన్ని నిర్మించి ప్రొడ్యూస్‌ చేస్తున్న సంగతి తెలిసిందే..

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles