నాని సినిమాకు కొత్త కష్టాలు!

Wednesday, January 22, 2025

నాచురల్‌ స్టార్ నాని గత సంవత్సరం నుంచి వరుస సినిమాలతో ముందుకు దూసుకుపోతున్నాడు. దసరా, హాయ్‌ నాన్న సినిమాలతో మంచి విజయాలను అందుకున్నాడు. తాజాగా డైరెక్టర్‌ వివేక్‌ ఆత్రేయ డైరెక్షన్‌ లో సరిపోదా శనివారం సినిమాలో నటిస్తున్నాడు.  ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శర వేగంగా జరుగుతుంది. ఇదిలా ఉంటే సాహో ఫేమ్ డైరెక్టర్ సుజీత్‍తో నాని ఓ మూవీ చేయనున్నట్లు సమాచారం.

అయితే, నాని,సుజీత్ కాంబో మూవీ మొదలవకుండానే ఇబ్బందులు వచ్చాయి.నేచురల్ స్టార్ నానితో దర్శకుడు సుజీత్ బిగ్గెస్ట్ యాక్షన్ మూవీ చేసేందుకు సిద్ధం అయ్యారు.నాని కుడా ఓకే చెప్పడంతో డీవీవీ ఎంటర్‌టైన్‍మెంట్స్ బ్యానర్‌ కింద  డీవీవీ దానయ్య ఈ మూవీని నిర్మించేందుకు సిద్ధం అయ్యారు. అయితే, ఈ సినిమా బడ్జెట్ బాగా ఉండటంతో నాని మార్కెట్ బేస్ చేసుకొని అంత బడ్జెట్ పెట్టేందుకు ముందుకు రావట్లేదని సమాచారం.

దీంతో నాని ,సుజీత్ మూవీ హోల్డ్ లో పడింది.మరి నాని, సుజీత్ మూవీ సెట్స్ పైకి  వెళ్తుందో లేదో చూడాలి. ప్రస్తుతం నాని నటిస్తున్న ‘సరిపోదా శనివారం’ సినిమా బిగ్గెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపుదిద్దుకుంటుంది. తాజాగా ఈ మూవీ క్లైమాక్స్ షూటింగ్‌ జరుపుకుంటుంది. ఈ సినిమాను ఆగస్టు 29న గ్రాండ్‌ గా విడుదల చేసేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తుంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles