పవన్ కళ్యాణ్ హీరోగా, ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్‌గా వస్తున్న సుజీత్ దర్శకత్వం వహించిన “ఓజి” సినిమాపై ఫ్యాన్స్ భారీగా ఆసక్తి చూపిస్తున్నారు. ఈ చిత్రంపై ముందే అంచనాలు బలంగా ఉండగా, ఒక్కో అప్డేట్ వచ్చినప్పుడల్లా హైప్ మరింత పెరుగుతోంది. థియేటర్లలో రిలీజ్‌కి ఇంకా టైమ్ ఉన్నా, ప్రమోషన్లు మాత్రం గట్టిగానే సాగుతున్నాయి.
ఇప్పటివరకు ట్రైలర్‌ను సెప్టెంబర్ 15న విడుదల చేస్తారని టాక్ వినిపించింది. కానీ ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం ఆ డేట్ మారినట్లు తెలుస్తోంది. ఈ నెల 18న ట్రైలర్ వస్తుందని అనుకుంటున్నారు. అయితే దీనిపై అధికారిక ప్రకటన మాత్రం ఇంకా రావాల్సి ఉంది.
