కత్రినా కుంభ్ స్నానం పై నెటిజన్లు కామెంట్లు! బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ కొందరు ఫోటోగ్రాఫర్ల పై సీరియస్ అయ్యారు. మహా కుంభమేళాలో ఇటీవల కత్రినా కైఫ్ పవిత్ర స్నానం ఆచరిస్తుండగా పలువురు వీడియోలు, ఫొటోల కోసం ఎగబడ్డారు. ఈ క్రమంలో కత్రినా కైఫ్ కి చాలా అసౌకర్యం కలిగింది. పైగా ఓ వ్యక్తి, కత్రినా కైఫ్ పక్కనే నిలబడి సెల్ఫీలు తీసుకుంటూ జోక్స్ కూడా వేయడం జరిగింది. ఆమె గ్లామర్ పై కూడా అతను కామెంట్స్ చేసినట్లు తెలుస్తోంది. దాంతో, కత్రినా కైఫ్ అతను పై సీరియస్ అయింది. ఐతే, ఆ వ్యక్తి కత్రినా కైఫ్ తో దిగిన ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. ‘ఇక్కడ నేను, నా సోదరుడు, కత్రినా ఉన్నారు’ అని వెకిలిగా చెప్పారు. ఈ ఘటనపై మరో నటి రవీనా టాండన్ ఆ వ్యక్తి పై సీరియస్ అవుతూ మండిపడ్డారు. ‘ఇది చాలా అసహ్యంగా ఉంది. శాంతియుతంగా, ప్రశాంతంగా ఉండాల్సిన క్షణాలను ఇలాంటి వ్యక్తులు నాశనం చేస్తారు’ అని నటి రవీనా టాండన్ ఆ వ్యక్తి పై ఫైరయ్యారు.
