హాలీవుడ్ నుంచి వచ్చిన తాజా సినిమా ఎఫ్1 ఇటీవలి కాలంలో భారీ విజయాన్ని సాధించింది. బ్రాడ్ పిట్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం రేసింగ్ స్పోర్ట్స్ డ్రామాగా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర వరల్డ్ వైడ్ స్థాయిలో సూపర్ హిట్ గా నిలిచింది.
ఇప్పటికే థియేటర్లలో రన్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం కొన్ని రోజుల క్రితం ఓటిటి ప్లాట్‌ఫాంలలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే సినిమా థియేటర్లో చూడలేకపోయినవారు ఇప్పుడు ఓటిటిలో చూసిన తర్వాత ఒకే భావన చెబుతున్నారు. చిన్న స్క్రీన్ పై కూడా సినిమా అద్భుతంగా అనిపిస్తుంటే పెద్ద స్క్రీన్‌లో చూసి ఉంటే ఎలాంటి అనుభూతి ఇచ్చేదో అని మిస్ అయ్యామనే ఫీల్‌తో ఉన్నారు.
అయినా సరే, ఓటిటిలో స్ట్రీమింగ్ మొదలైన వెంటనే కూడా ఈ సినిమాకి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.
