నయన తార నిర్మాతగా..సేతుపతి హీరోగా!

Sunday, January 26, 2025

నయన తార నిర్మాతగా..సేతుపతి హీరోగా! తమిళ స్టార్ హీరోలలో విజయ్ సేతుపతి కూడా ఒకరు. ఇటీవల సేతుపతి నటించిన ‘ మహారాజా’ సూపర్ హిట్ గా నిలిచి భారీ వసూళ్లను రాబట్టింది. తొలిసారి విజయ్ సేతుపతిని వంద కోట్ల హీరోగా మార్చింది కూడా మహారాజా సినిమానే . నీతిలన్ స్వామి నాథన్ దర్శకత్వం వహించిన ఈ మూవీ వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ వద్ద రూ. 100 కోట్లకు పైగా వసూలు చేసింది.

తాజాగా ఈ సినిమాను చైనా భాషలో రీమేక్ చేయగా అక్కడ కూడా బ్లాక్ బస్టర్ గా నిలిచి వంద కోట్లు వసూలు చేసింది. తాజాగా సేతుపతి నటించిన విడుదల థియేటర్స్ లో రిలీజ్ అయి హిట్ టాక్ తో సాగుతుంది.అదే జోష్ లో సేతుపతి మరొక మాస్ యాక్షన్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు కోలీవుడ్ మీడియాలో వార్తలు వినపడుతున్నాయి.

యాక్షన్ సినిమాలకు పేరొందిన హరి దర్శకత్వంలో విజయ్ సేతుపతి ఓ సినిమా చేయనున్నాడట. ఇద్దరి మధ్య ఇప్పటికే కథా చర్చలు ముగిశాయని కూడా తెలుస్తుంది. అయితే ఈ సినిమాను లేడీ సూపర్ స్టార్ నయనతార నిర్మించనుందట. నయన్ సొంత బ్యానర్ రౌడీ పిచ్చర్స్ పై నిర్మిస్తుందంట.

ఇప్పటి వరకు మిడ్ రేంజ్ సినిమాలకు నిర్మాతగా వ్యవహరిస్తున్న నయన్ తొలిసారిగా ఓ భారీ బడ్జెట్ సినిమాను తెరకెక్కించబోతుంది. అయితే ప్రస్తుతం ఈ సినిమా ఇంకా చర్చల దశలోనే ఉందని అన్ని వివరాలు త్వరలోనే వివరిస్తామని అంటున్నాయట నయన్ నిర్మాణ సంస్థ వర్గాలు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles