నయన్ చాలా కాస్ట్లీ గురూ!

Tuesday, January 21, 2025

సౌత్ లో లేడీ సూపర్‌ స్టార్‌ నయన తార…విఘ్నేశ్‌ శివన్‌ ను పెళ్లి చేసుకొని తల్లి అయిన తరువాత కూడా ఆమె క్రేజ్‌ ఏ మాత్రం తగ్గలేదు. ఇప్పటికీ తాను ఓ సినిమా కోసం కనీసం నాలుగైదు నెలలు ఆమె కష్టపడితే ఆమెకు రూ. 5 కోట్ల మేర రెమ్యునరేషన్‌ తీసుకుంటుంది.  అయితే కేవలం 50 సెకన్ల యాడ్ లో ఆమె నటించినందుకు ఐదు కోట్లు పారితోషికం తీసుకుని ఆమె టాపిక్ ఆఫ్ ది ఫిలిమ్ ఇండస్ట్రీగా మారిపోయింది.

షారూఖ్ ఖాన్ తో నటించిన ‘జవాన్’ మూవీ సూపర్ హిట్ అయిన తరువాత నయనతార రెమ్యునరేషన్ భారీగా పెంచి రూ.10 కోట్ల మేర తీసుకుంటున్నట్లు కోలీవుడ్ మీడియా వార్తలు రాస్తుంది. ప్రస్తుతం బాలీవుడ్ నుండి కూడా ఈమెకు అవకాశాలు బాగా వస్తున్నాయి. గతంలో హీరోయిన్స్ కు సినిమాలలో నటించినప్పుడు మాత్రమే పారితోషికం ఇలా భారీ స్థాయిలో తీసుకుంటూ ఉండేవారు. అయితే ఇప్పుడు హీరోయిన్లు.. హీరోలతో సినిమాలలో నటించడం వల్ల వచ్చే పారితోషికంతో పాటు యాడ్స్ లో నటించడం వల్ల ఇన్ స్టా గ్రామ్ ట్విట్టర్ లో పోస్టింగ్స్ పెట్టడం వల్ల కూడా భారీ పారితోషికాలు అందుకుంటున్నారు.

ఒక సినిమాలో నటించినందుకు దక్షిణాది సినిమా రంగంలోనే భారీ పారితోషికం తీసుకునే నయనతార.. తను నటించే సినిమాల ప్రమోషన్ విషయంలో ఏమాత్రం పట్టించుకోదు. కనీసం ఆమె నటించిన మూవీ ఫంక్షన్స్ కు కూడా ఆమె రాదు. అయినప్పటికీ దర్శక నిర్మాతలు ఆమె తమ సినిమాలకు సంబంధించి తేదీలను ఖరారు చేస్తే చాలనుకుంటారు. నయనతార ను ఆదర్శంగా తీసుకుని చాలామంది హీరోయిన్లు సినిమాలలో నటించే విషయం కంటే యాడ్లలో చేయడానికి ముందుకు వస్తున్నారు.

ఆ మధ్య నయన్ కు ఆమె భర్త విఘ్నేష్ శివన్ కు విభేదాలు వచ్చాయి అంటూ కోలీవుడ్ మీడియాలో పలు రూమార్లు షికారు చేశాయి.  అయితే దానికి చెక్ పెడుతూ ఆమె ప్రస్తుతం తన భర్త ఆమె కవల పిల్లలతో కలిసి గ్రీస్ లో హాలీడే ట్రిప్ ఎంజాయ్ చేస్తోంది. ఈ మలయాళీ బ్యూటీ కెరీర్ స్టార్టింగులో పలు అవమానాలను, ఆవేదనలు, కష్టాలను చవి చూసినా ఆ తర్వాత మాత్రం చాలా వేగంగా స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles