మరో అరుదైన ఘనత సాధించిన నేచురల్‌ స్టార్ నాని!

Wednesday, January 22, 2025

గతేడాది నేచురల్‌ స్టార్‌ నాని హీరోగా నటించిన హాయ్‌ నాన్న సినిమా ఎంత పెద్ద హిట్‌ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ సినిమాలో నాని సరసన మృణాల్‌ ఠాకూర్‌ కథానాయికగా చేసి మెప్పించింది.  నాని కూతురు పాత్రలో కియారా ఖన్నా నటించి అందరిని మెప్పించింఇ.

ఈ సినిమా అటు ప్రేమ కథతో పాటు తండ్రీకూతుళ్ల సెంటిమెంట్‍తో వచ్చి అందర్ని ఎంతగానో మెప్పించింది. దర్శకుడు శౌర్యవ్ ఈ మూవీని అద్భుతంగా తెరకెక్కించారు. ఈ సినిమాకి  హేషమ్ అబ్దుల్ వాహబ్ అందించిన పాటలు  ఎంతో మంచి పేరు తెచ్చిపెట్టాయి. వైరా ఎంటర్‌టైన్‍మెంట్స్ బ్యానర్ ఈ మూవీని నిర్మించింది.థియేటర్స్ లో మంచి విజయం సాధించిన హాయ్ నాన్న  రూ.76కోట్ల వసూళ్లను సాధించి అదరగొట్టింది.థియేటర్స్ లో ఎంతగానో ఆకట్టుకున్న ఈ సినిమా నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో ఈ ఏడాది జనవరిలో స్ట్రీమింగ్‍కు వచ్చింది.

ఇదిలా ఉంటే ఈ మూవీ మరో అరుదైన ఘనత ను ఖాతాలో వేసుకుంది . హాయ్ నాన్న సినిమా  మరో అంతర్జాతీయ వేదికపై వరుస అవార్డులు లభించాయి. తాజాగా ఈ విషయాన్ని సినిమా బృందం స్వయంగా వెల్లడించింది. స్వీడిష్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‍ 2024లో ఈ  సినిమా ఏకంగా ఆరు అవార్డులు సొంతం చేసుకుంది.

ఈ స్వీడెష్ ఫిల్మ్ ఫెస్టివల్‍లో మ్యూజిక్ డైరెక్టర్ హేషమ్ అబ్దుల్ వాహబ్ కు మూడు అవార్డులు , డైరెక్టర్ శౌర్యువ్‍కు రెండు అవార్డులు , నాని – మృణాల్‍ జోడికి ఓ అవార్డు ను అందుకుంది. హాయ్ నాన్న సినిమాకు అవార్డులు రావడం పట్ల చిత్ర బృందం ఎంతో సంతోషంగా ఉంది. “ప్రేమ, ప్రశంసలతో సినిమా సెలెబ్రేషన్ జరుగుతోంది. స్వీడిష్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో హాయ్ నాన్నసినిమా ఆరు అవార్డులను సొంతం చేసుకుంది. ప్రేమకు అసలైన ప్రతిధ్వని ఇది. 18 ఇంటర్నేషనల్ అవార్డులు.. కౌటింగ్” అని వైరా ఎంటర్‌టైన్‍మెంట్స్ నేడు ట్వీట్ చేసింది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles