చరణ్‌ సినిమాలో నేషనల్‌ క్రష్‌!

Andhrawatch
1 Min Read

గ్లోబల్‌ స్టార్‌ చరణ్‌ ప్రస్తుతం గేమ్‌ ఛేంజర్‌ షూటింగ్‌ లో ఫుల్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.  ఈసినిమాని స్టార్‌ డైరెక్టర్‌ శంకర్‌ తెరకెక్కిస్తున్న ఈ సినిమా చాలా ఆలస్యంగా షూటింగ్‌ జరుపుకుంటుంది. ఈ సినిమా షూటింగ్‌ త్వరలోనే పూర్తి కానుంది.  ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా చేస్తుంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ వైజాగ్ లో జరుగుతుంది. వైజాగ్ షెడ్యూల్ తో ఈ సినిమా షూటింగ్ పూర్తి కానున్నట్లు సమాచారం.

ఈ క్రమంలోనే రాంచరణ్ ఉప్పెన ఫేమ్ బుచ్చి బాబు సన డైరెక్షన్ లో తన తరువాత సినిమా చేస్తున్నాడు.RC16 వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది.ఈ సినిమా ఎప్పుడో లాంఛనంగా ప్రారంభం అయింది. అయితే గేమ్ ఛేంజర్ సినిమా షూటింగ్ పూర్తి కాగానే చరణ్ ఈ సినిమా షూటింగ్ లో పాల్గొనబోతున్నారు. ఈ సినిమా లో రాంచరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం గురించి తెలిసిందే. ఈ సినిమాకు ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ ఇస్తున్నారు.

ఇదిలా ఉంటే ఈ సినిమాలో రష్మిక కూడా మరో హీరోయిన్ గా చేస్తున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఇప్పటికే టాలీవుడ్ లో  టాప్ స్టార్స్ తో నటించిన రష్మిక ప్రస్తుతం పుష్ప 2 మూవీతో పాటు ,ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే.అయితే  చరణ్ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా రష్మిక నటించేందుకు రెడీ  అయినట్లు సమాచారం. త్వరలోనే రష్మిక పాత్ర గురించి మేకర్స్ అధికారికంగా ప్రకటించనున్నారు.

Share This Article