ఆ ఐదు లక్షణాలు ఉండాల్సిందే అంటున్న నారా వారాబ్బాయి!

Saturday, January 18, 2025

తెలుగు చిత్ర పరిశ్రమలో కంటెంటే ఉన్న చిత్రాలను ఎంచుకుని చేసే హీరోగా నారా రోహిత్‌ కి మంచి పేరుంది. ఇక ఈసారి ఓ కంప్లీట్ మేకోవర్‌తో కామెడీ ఎంటర్‌టైనర్ కథను ఎంచుకుని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాడు. ‘సుందరకాండ’ అనే సినిమాలో నారా రోహిత్ నటిస్తుండగా, ఈ చిత్ర టీజర్‌ను తాజాగా చిత్ర బృందం విడుదల చేసింది.

తాను పెళ్లి చేసుకోబోయే అమ్మాయిలో ఓ ఐదు లక్షణాలు ఉండాలని కోరే అబ్బాయి పాత్రలో నారా రోహిత్ ఈ సినిమాలో యాక్ట్‌ చేస్తున్నాడు. ఇక ఈ క్రమంలో అతడికి ఏ అమ్మాయి సెట్ కాకపోవడం.. దీంతో ఫ్యామిలీ మెంబర్స్ ఆందోళన పడటం వంటి నేపథ్యంలో ఈ సినిమా కథ సాగనుందని టీజర్ చూస్తే తెలిసిపోతుంది. మరి నారా రోహిత్ అనుకున్న ఐదు లక్షణాలు కలిగిన అమ్మాయి అతడికి దొరుకుతుందా లేదా అనేది మాత్రం సినిమాలో చూడాల్సిందే.

ఈ సినిమాలో శ్రీదేవి విజయ్ కుమార్, వీర్తి వాఘాని, నరేష్, వాసుకి ఆనంద్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను వెంకటేష్ నిమ్మలపూడి డైరెక్ట్ చేస్తుండగా.. సంతోష్ చిన్నపోల్ల, గౌతమ్ రెడ్డి, రాకేశ్ మహంకాళి ప్రొడ్యూస్ చేస్తున్నారు. 

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles