ఆ హీరోయిన్‌ తో నారా రోహిత్‌ నిశ్చితార్థం!

Wednesday, January 22, 2025

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తమ్ముని కుమారునిగా నారా రోహిత్‌ టాలీవుడ్‌ లో అడుగుపెట్టాడు. తొలి సినిమా బాణంతో టాలీవుడ్‌ లో దూసుకుపోతున్నాడు. ఆ తర్వాత పరశురామ్ డైరెక్షన్‌ లో వచ్చిన సోలో సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. రౌడీ ఫెలో, అప్పట్లో ఒకటి ఉండేవాడు వంటి సూపర్ హిట్ సినిమాలలో నటించి ప్రేక్షకుల్ని అలరించాడు.  

ఈ కుర్ర హీరో ఇండస్ట్రీలో అడుగుపెట్టి చాలా కాలం అవుతోంది. ఆ మధ్య కొన్నాళ్లు సినిమాలకు గ్యాప్‌ ఇచ్చి…పెదనాన్న పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నాడు. నారా రోహిత్‌  తాజాగా కొద్ది రోజుల క్రితం  సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ప్రస్తుతం సుందరకాండ అనే సినిమా విడుదలకు సిద్దంగా ఉంది. కాగా నారా రోహిత్ గురించి ఓ ఆసక్తికర వార్త వినిపిస్తోంది. ఈ నారా వారబ్బాయి త్వరలో ఓ ఇంటి వాడు కాబోతున్నాడంట. ఈ నెల 13న నారా రోహిత్ నిశ్చితార్థం జరగనున్నట్టు సమాచారం.

ఇటీవల ఈ హీరో నటించిన  ప్రతినిధి -2 లోని  హీరోయిన్ తో రోహిత్ నిశ్చితార్ధం జరగనుంది. ఈ వేడుకకు ఇరు కుటుంబ సభ్యులతో పాటు ఏపీ సీఎం నారా చంద్రబాబు, నందమూరి బాలకృష్ణ కుటుంబాలు కూడా  పాల్గొనబోతున్నాయి. ఎంగేజ్ మెంట్ తో ఒక్కటి కాబోతున్న ఈ జంట వివాహా వేడుకను త్వరలో గ్రాండ్ గా నిర్వహించనున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles