వరదాగా రాబోతున్న నారా రోహిత్‌!

Sunday, December 22, 2024

టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న మల్టీస్టారర్ సినిమాల్లో  ‘భైరవం’ మూవీ కూడా ఒకటి. ఇప్పటికే ఈ సినిమా ప్రేక్షకుల దృష్టిని తన వైపునకు తిప్పుకుంది.  ఈ సినిమాను దర్శకుడు విజయ్ కనకమేడల డైరెక్ట్ చేస్తుండటంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై మంచి పాజిటివ్ వైబ్స్ క్రియేట్ అవుతున్నాయి.

 ఇక ఈ సినిమా నుంచి  తాజాగా హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ని చిత్ర బృందం విడుదల చేసింది. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌కి అదిరిపోయే రెస్పాన్స్ దక్కింది. అంతేగాక, టైటిల్ విషయంలోనూ ప్రేక్షకులు ఆసక్తిగా ఉన్నారు.

ఇక ఈ సినిమా నుండి తాజాగా మరో యంగ్‌ హీరో నారా రోహిత్‌కి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ని చిత్ర బృందం ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చింది. ఈ సినిమాలో నారా రోహిత్ ‘వరదా’ అనే పవర్‌ఫుల్ పాత్రలో యాక్ట్‌ చేస్తున్నాడు. పూర్తి యాక్షన్ మోడ్‌లో ఉన్న నారా రోహిత్ ఈ సినిమాలో సరికొత్త లుక్‌తో కనిపిస్తున్నాడు.

ఇక ఈ సినిమాలో మరో నటుడు మంచు మనోజ్ కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. త్వరలోనే ఆయన పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ని కూడా మేకర్స్ రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాను శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కె.కె.రాధామోహన్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. శ్రీచరణ్ పాకాల ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles