న్యాచురల్ స్టార్ నాని హీరోగా చేస్తున్న తాజా సినిమా ది ప్యారడైస్పై సినీ ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఏర్పడింది. ఇప్పటివరకు విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్ వల్ల ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు మరింతగా పెరిగాయి. ఈ సినిమాను దర్శకుడు శ్రీకాంత్ ఓదెల చాలా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు.
తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఒక ఆసక్తికరమైన అప్‌డేట్ బయటకు వచ్చింది. ఇందులో ప్రధాన ప్రతినాయకుడిగా కలెక్షన్ కింగ్ డా. మోహన్ బాబు నటిస్తున్నారని చిత్రబృందం ప్రకటించింది. ఆయన లుక్‌ను చూపిస్తూ ఒక ప్రత్యేక పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. ఇందులో ఆయన షికంజ మాలిక్ అనే గ్యాంగ్‌స్టర్ పాత్రలో కనిపించనున్నారు. రేట్రో స్టైల్లో సిగార్ నోట్లో పెట్టుకుని, చేతిలో గన్ పట్టుకుని స్టైలిష్‌గా నడుస్తున్న మోహన్ బాబు పోస్టర్ ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఈ లుక్ చూసిన తర్వాత ఆయన పాత్ర ఎంత శక్తివంతంగా ఉండబోతోందో ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
