నాని సినిమా అంటే ఈ మాత్రం ఉండాల్సిందే!

Friday, December 20, 2024

నేచురల్ స్టార్ నాని హీరోగా యంగ్ హీరోయిన్ ప్రియాంక మోహన్ హీరోయిన్ గా డైరెక్టర్‌ వివేక్ ఆత్రేయ తెరకెక్కించిన సాలిడ్ యాక్షన్ డ్రామా మూవీ “సరిపోదా శనివారం” గురువారం విడుదలై మంచి టాక్ అందుకొని భారీ రెస్పాన్స్ ని  అందుకున్న సంగతి తెలిసిందే. మరి నాని కెరీర్ లో మాస్ సినిమాలకి ఉండే ఇంపాక్ట్ ని మరోసారి ఈ సినిమా ద్వారా చూపించాడు అని చెప్పాలి.  ఒక్క యూఎస్ మార్కెట్ లోనే కాకుండా వరల్డ్ వైడ్ గా మరోసారి భారీ ఓపెనింగ్స్ ని నాని రీచ్ అయ్యాడు.

నాని తన కెరీర్ లోనే రెండో హైయెస్ట్ ఓపెనింగ్స్ ని అందుకున్నట్టుగా ఇప్పుడు తెలుస్తుంది. నిన్న ఈరోజు మాత్రమే  సరిపోదా శనివారం సినిమా ఏకంగా 25 కోట్ల మేర గ్రాస్ ని అందుకున్నట్టుగా సమాచారం. దీంతో ఇది నాని కెరీర్ లో దసరా తర్వాత మరో భారీ ఓపెనర్ గా నిలిచింది అని తెలుస్తుంది. అయితే నాని చేస్తున్న సినిమాల్లో మాస్ సినిమాల తాలూకా ఇంపాక్ట్ చాలా గట్టిగా ఉంటుదని మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. మరి నాని నుంచి నెక్స్ట్ సినిమాలు ఎలా ఉంటాయో చూడాలని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఉన్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles