హింసకు కొత్త నిర్వచనం!

Sunday, March 30, 2025

నేచురల్ స్టార్ నాని పుట్టినరోజు సందర్భంగా ఈరోజు హిట్ 3 టీమ్ టీజర్‌ను విడుదల చేసింది. సర్కార్స్ లాఠీ పేరుతో, ప్రత్యేక వీడియో దాదాపు రెండు నిమిషాల నిడివిని కలిగి ఉంది. ఈ టీజర్‌ని బట్టి చూస్తే, నాని కెరీర్‌లోనే అత్యంత హింసాత్మక చిత్రంగా, ఆద్యంతం రక్తపాతంతో కూడిన చిత్రంగా హిట్‌ 3 నిలుస్తుందని అంచనాలు ఉన్నాయి. కాగా ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో నాని అర్జున్ సర్కార్ అనే షార్ట్ టెంపర్డ్ పోలీస్‌గా కనిపించబోతున్నాడు. యాంగ్రీ పోలీసుగా నాని బాగా సెట్ అయ్యాడు.

కాగా నాని బాడీ లాంగ్వేజ్ కూడా పాత్రకు సరిగ్గా సరిపోతుంది. పాత్రను కన్విన్సింగ్‌గా చూపించడానికి అతను లుక్స్ కూడా బాగా సెట్ అయ్యాయి. నేచురల్ స్టార్ తన పక్కింటి అబ్బాయి పాత్రల నుండి తప్పుకుని.. తన కొత్త అవతార్‌లో బాగా ఆకట్టుకున్నాడు. టీజర్‌ను బట్టి చూస్తే, హిట్ 3లో యాక్షన్ థ్రిల్లర్ గా అనిపిస్తోంది. సాను జాన్ వర్గీస్ యొక్క విజువల్స్ బాగున్నాయి. మిక్కీ జె మేయర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. కేజీఎఫ్ స్టార్ శ్రీనిధి శెట్టి కథానాయికగా నటిస్తోంది. వాల్ పోస్టర్ సినిమా, యునానిమస్ ప్రొడక్షన్స్ పతాకాలపై ప్రశాంతి తిపిర్నేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : admin@andhrawatch.com

Latest Articles