వంద కోట్ల క్లబ్‌ లో నాని సినిమా!

Monday, December 8, 2025

శైలేష్ కొలను దర్శకత్వంలో న్యాచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కించిన యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘హిట్ 3’. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. కేవలం నాలుగు రోజుల్లోనే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.101 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అటు యూఎస్‌లోనూ ఈ సినిమా $2 మిలియన్లు వసూలు చేసినట్లు మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. నాని సినీ కెరీర్ లో ‘దసరా, సరిపోతుందా శనివారం’ తర్వాత అత్యంత వేగంగా రూ.100 కోట్లు వసూలు చేసిన సినిమాగా హిట్-3 నిలిచింది.

ఇక ఈ సినిమాలో నాని పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్‌కు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ముఖ్యంగా అర్జున్ సర్కారుగా తన పాత్రలో నాని అద్భుతంగా నటించాడు. కీలక సన్నివేశాల్లో నాని అభినయం మొత్తం సినిమాకే మెయిన్ హైలైట్. శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకు మిక్కీ జే మేయర్ సంగీతం అందించాడు. ఈ సినిమాను దర్శకుడు శైలేష్ కొలను డైరెక్ట్ చేయగా వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ ప్రొడ్యూస్ చేసింది. మొత్తమ్మీద ఈ సినిమా భారీ విజయాన్ని సాధించింది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles