ఓవర్సీస్ లో నాని డామినేషన్…!

Tuesday, December 9, 2025

తెలుగు సినిమా దగ్గర మోస్ట్ ప్రామిసింగ్ మరియు ప్రాఫిటబుల్ హీరో ఎవరైనా ఉన్నారు అంటే అది నాచురల్ స్టార్ నాని అనే చెప్పాలి. థియేట్రికల్ నుంచి నాన్ థియేట్రికల్ వరకు సినిమా ఇంకా మొదలు కాకుండానే లాభాలు అందించే స్థిరమైన హీరోగా నాని మన టాలీవుడ్ లో ఇపుడు ముద్ర వేసుకున్నాడు.

అయితే ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్ మార్కెట్ లో కూడా ఇదే తరహా నిలకడని ఓ హీరో కొనసాగించడం అనేది అరుదుగానే కనిపిస్తుంది. అయితే ఆ అరుదైన అతి కొద్ది మంది హీరోస్ లో నాచురల్ స్టార్ నాని కూడా ఒక హీరో అనే సంగతి తెలిసిందే. నాని ఓవర్సీస్ మార్కెట్ స్టామినా ఏ రేంజ్ లో ఉందంటే నార్త్ అమెరికాలో ఏకంగా తన ఖాతాలో 1 మిలియన్ డాలర్స్ సాధించిన సినిమాలు 11 ఉన్నాయి.

మన తెలుగు నుంచి ఇన్ని ఎక్కువ సినిమాలు ఉన్న హీరోస్ లో మహేష్ బాబు 12 సినిమాలతో మొదటి స్థానంలో ఉంటే తన తర్వాత ఉన్న ఏకైక హీరోగా నాని నిలిచాడు. ఇక దీనితో పాటుగా 1.5 మిలియన్ డాలర్స్ గ్రాస్ అందుకున్న హీరోస్ లో టాప్ 5 లో ఒకడిగా నిలిచాడు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles