ఒక్క పోస్టర్‌ తో ఫ్యాన్స్‌ని కన్ఫ్యూజన్ లో పడేసిన నాని!

Wednesday, January 22, 2025

నేచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా అవైటెడ్‌ సినిమా సరిపోదా శనివారం’. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో కన్నడ ముద్దు గుమ్మ ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా చేస్తుంది. ‘అంటే సుందరానికి ‘ లాంటి సూపర్ హిట్ తర్వాత వివేక్, నాని కాంబోలో రాబోతున్న ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి.

ఇప్పటికే విడుదలైన టీజర్ మంచి రెస్పాన్స్ సొంతం చేసుకోగా.. రీసెంట్ గా మ్యూజికల్ గా ప్రమోషన్ స్టార్ట్ చేస్తూ విడుదల చేసిన ఫస్ట్ సింగిల్ ఆకట్టుకుంది. నాని ఇందులో సూర్య అనే పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే. ఆ పాత్రకు సంబంధించిన రెండో లుక్‌ను గురువారం విడుదల చేశారు. శనివారాల్లో యాక్షన్‌ కోణంలో వైలెంట్‌ గా కనిపించే సూర్య.. మిగిలిన రోజుల్లో ఎలా ఉంటాడన్నది ఈ ప్రచార చిత్రంతో ఓ క్లారిటీ ఇచ్చారు. నాని ఆ పోస్టర్‌లో ఓ పక్కింటి కుర్రాడి తరహాలో బైక్‌పై చిరునవ్వులు చిందిస్తూ ఉండడం చూడొచ్చు.

‘‘వినూత్నమైన కథాంశంతో రూపుదిద్దుకుంటున్న యాక్షన్‌ సినిమా ఇది. దీంట్లో నాని పాత్ర రెండు కోణాల్లో కనిపిస్తుంది. ప్రస్తుతం చిత్రీకరణ ముగింపు దశలో ఉంది’’ అని మూవీ మేకర్స్‌ తెలిపారు. తాజాగా విడుదల చేసిన ఈ పోస్టర్ లో నాని క్లాస్ లుక్ తో కనిపించడం ఫ్యాన్స్  కన్ఫ్యూజన్ లో పడేసింది. దీంతో నాని ఇందులో డ్యూయెల్ రోల్ చేస్తున్నాడా? లేక ఒక్కడే రెండు డిఫరెంట్ షేడ్స్ లో కనిపిస్తాడా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఆగస్టు 29న థియేటర్లలో సందడి చేయనుంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles