ఓటీటీ స్ట్రీమింగ్‌ కి వచ్చేసిందిగా!

Sunday, March 30, 2025

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ ‘డాకు మహారాజ్’ సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విజయం అందుకుంది. ఈ సినిమాను దర్శకుడు బాబీ కొల్లి డైరెక్ట్ చేయగా పూర్తి యాక్షన్ డ్రామా మూవీగా ఈ చిత్రం ప్రేక్షకులను అలరించింది. ఇక ఈ సినిమాలో బాలయ్య పర్ఫార్మెన్స్‌కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.

బాక్సాఫీస్ దగ్గర సాలిడ్ వసూళ్లు రాబట్టిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యింది. ఈ చిత్ర ఓటీటీ స్ట్రీమింగ్ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ మంచి ఫ్యాన్సీ రేటింగ్‌కు దక్కించుకుంది. ఇక ఇప్పుడు ఈ చిత్రాన్ని ఓటీటీ స్ట్రీమింగ్‌కు నెట్‌ఫ్లిక్స్ తీసుకొచ్చింది. థియేటర్లలో ఈ సినిమాను చూసి ఎంజాయ్ చేసిన వారు.. థియేటర్స్‌లో ఈ చిత్రాన్ని మిస్ అయినవారు ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో చూసి ఎంజాయ్ చేయవచ్చు.

ఇక ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, ఊర్వశి రౌటేలా, చాందిని చౌదరి, బాబీ డియోల్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు థమన్ సంగీతం అందించగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చున్ ఫోర్ సినిమాస్ బ్యానర్లు సంయుక్తంగా ప్రొడ్యూస్ చేశాయి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : admin@andhrawatch.com

Latest Articles