అక్కినేని యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నాగ చైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు చందూ మొండేటి తెరకెక్కించిన అవైటెడ్ సినిమానే “తండేల్”. మేకర్స్ పెట్టుకున్న అన్ని అంచనాలు అందుకోవడమే కాకుండా నాగ చైతన్య కెరీర్లో బిగ్గెస్ట్ గ్రాసర్ గా తనకి క్రేజీ కం బ్యాక్ సినిమాగా కూడా ఇది నిలిచింది. మరి థియేటర్స్ లో వచ్చిన ఈ రెండు వారాల్లోనే మంచి వసూళ్లతో ఆల్మోస్ట్ రన్ ని కూడా ముగించేసుకుంది.
అయితే ఇక తండేల్ ఓటిటి రిలీజ్ పై లేటెస్ట్ బజ్ వినిపిస్తుంది. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులు దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇందులో సినిమా రిలీజ్ అయ్యిన సరిగ్గా నెలకే రానున్నట్టు తెలుస్తుంది. అంటే మార్చ్ 7 శుక్రవారం నుంచి తండేల్ పాన్ ఇండియా భాషల్లో రానున్నట్టుగా టాక్. మరి దీనిపై అధికారిక క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించగా బన్నీ వాసు నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.