అక్కినేని నాగ చైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు చందూ మొండేటి తెరకెక్కించిన సూపర్ హిట్ చిత్రం “తండేల్” కోసం అందరికీ తెలిసిందే. మరి ఎన్నో అంచనాలు నడుమ వచ్చిన ఈ సినిమా వాటిని అందుకొని అదరగొట్టింది. ఇలా 100 కోట్ల దిశగా వెళుతున్న ఈ చిత్రం ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్ మార్కెట్ లో కూడా మంచి ఓపెనింగ్స్ సాధించింది.
మరి ఇలా లేటెస్ట్ గా సినిమా 1 మిలియన్ డాలర్స్ మార్క్ ని క్రాస్ చేసేసి నాగ చైతన్య కెరీర్లో మరో మైల్ స్టోన్ గ్రాసర్ గా నిలిచింది. మొత్తానికి అయితే తండేల్ పెట్టుకుని అన్ని అంచనాలు రీచ్ అయ్యింది అని చెప్పవచ్చు. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ బ్యూటిఫుల్ సంగీతం అందించగా గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీ వాసు నిర్మాణం వహించగా పాలన్ ఇండియా భాషల్లో ఈ చిత్రం రిలీజ్ కి వచ్చింది.