యూరప్ లో శోభితతో నాగ చైతన్య పిక్స్‌ వైరల్‌!

Sunday, December 22, 2024

అక్కినేని యువ హీరో నాగచైతన్య, నటి సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. కానీ వీరి కాపురం ఎక్కువ కాలం నిలబడలేదు. కొద్ది కాలానికే విడాకులు తీసుకుని విడిపోయారు. ఆ తరువాత నాగచైతన్య మాత్రం సినిమాలు చేస్తూ బిజీగా అయిపోయాడు. అలాగే గత కొద్ది కాలంగా చై యంగ్ బ్యూటీ శోభితతో డేటింగ్‌లో ఉన్నట్లు పలు వార్తలు నెట్టింట వైరల్ గా మారుతున్నాయి. ఈ క్రమంలోనే శోభితతో ఓ హోటల్‌కు వెళ్లడంతో వీరి డేటింగ్ నిజమేనని అంతా కన్ఫర్మ్ అయిపోయారు.

 శోభిత, చై ఇద్దరు నెట్టింట పలు ఫొటోలతో తమ రిలేషన్‌ను ఇండైరెక్టర్‌గా తెలుపుతున్నట్లు రుమార్స్‌ షికారు చేస్తున్నాయి. కానీ వీరు మాత్రం డేటింగ్ వార్తల్లో నిజం లేదని క్లారిటీ ఇచ్చారు. అయినప్పటికీ కొందరు నిజమే అని వాదిస్తున్నారు. తాజాగా, శోభితతో నాగచైతన్య యూరప్ ట్రిప్‌కు వెళ్లాడు. అక్కడ ఓ వైన్ టెస్ట్ పార్టీ జరుగుతుండగా అక్కడికి వీరిద్దరూ కలిసి వెళ్లినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.

దీంతో అది చూసిన వారు కొందరు సమంత విడాకులు తీసుకోగానే చై మూవ్ ఆన్ అయ్యాడు అని కొందరు కామెంట్లు పెడుతున్నారు. మరికొందరు మాత్రం వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారు అందుకే కలిసి యూరప్‌కు వెళ్లారని పలు రకాలుగా చర్చించుకుంటున్నారు. ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ వీరికి సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

అయితే శోభిత డేటింగ్ వార్తలపై స్పందించినట్లు తెలుస్తోంది. ‘‘వ్యక్తులు సగం జ్ఞానంతో రాసే విషయాలకు సమాధానమివ్వడం కంటే వదిలేయడం మంచిది. ఒకరి జీవితంపై దృష్టి పెట్టే విధానంను మెరుగుపరుచుకోండి. ప్రశాంతంగా ఉండండి. మంచి వ్యక్తిగా ఉండటానికి ట్రై చేయండి’’ అని చెప్పుకొచ్చింది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles