సూపర్‌ ఛాన్స్‌ కొట్టేసిన నాగ్‌ హీరోయిన్‌!

Sunday, December 22, 2024

 నా సామిరంగ సినిమాతో తెలుగు చిత్ర సీమకు పరిచయమైన నటి ఆషికా రంగనాథ్‌. ఈ ముద్దుగుమ్మ సౌత్‌ లో వరుస ఆఫర్స్‌ అందుకుంటుంది. ఇప్పటికే మెగాస్టార్ ‘విశ్వంభర’ లో కీలక పాత్రలో నటిస్తున్న ఈ కన్నడ ముద్దుగుమ్మ ఇప్పుడు కోలీవుడ్ లో మరో ఆఫర్ చేజిక్కించుకుంది. ఏకంగా తమిళ్ స్టార్ హీరో కార్తితో ఆడిపాడనుంది.

కార్తీ హీరోగా రూపొందిన ‘సర్దార్‌’ తమిళనాట భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘సర్దార్‌ 2’నుదర్శకుడు పీఎస్‌ మిత్రన్‌ తెరకెక్కిస్తున్నారు. ఇందులో హీరోయిన్‌గా అషికా రంగనాథ్‌ ను చిత్ర బృందం ఎంపిక చేసినట్లు సమాచారం. ఇప్పటికే ఈ విషయమై కథా చర్చలు పూర్తయినట్లు తెలిసింది. త్వరలోనే ఈ విషయాన్ని చిత్ర బృందం అఫీషియల్ గా అనౌన్స్ చేయనున్నట్లు తెలుస్తోంది. కాగా కార్తి ప్రస్తుతం ఈ సినిమా కోసం లుక్‌ మార్చుకునే పనిలో ఉన్నారు. స్పై యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కనున్నఈ సినిమా కజకిస్థాన్, అజర్‌బైజాన్, జార్జియా వంటి దేశాల్లో షూటింగ్ జరుపుకోనుంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles