ఎన్‌ కన్వెన్షన్‌ కూల్చివేత పై నాగ్‌ ఎమోషనల్‌!

Andhrawatch
1 Min Read

టాలీవుడ్ సీనియర్ హీరోస్ లో కింగ్‌ అక్కినేని నాగార్జున కూడా ఒకరు. మరి కింగ్ నాగ్ బర్త్ డే కానుకగా ఆయన అంతకు “మాస్” రీ రిలీజ్ కోసం రెండు తెలుగు రాష్ట్రాల్లో  అభిమానులు  సాలిడ్ ప్లానింగ్ లు కూడా చేసుకుంటున్నారు. కానీ ఇంతలోనే హైదరాబాద్ లో ఉన్నటువంటి తన ఎన్ కన్వెన్షన్ హాల్ ని ప్రభుత్వం శనివారం ఉదయం నుంచే కూల్చివేయడం అనేది ఒక్కసారిగా అందరిలో షాక్‌ కి గురి చేసింది.

సోషల్ మీడియాలో కూడా శనివారం ఉదయం నుంచి కూల్చివేత దృశ్యాలు వైరల్ గా మారాయి. అయితే దీనిపై నాగ్ నుంచి ఎలాంటి స్పందన వస్తుందనే సమయంలో తాను ఒక ఎమోషనల్ పోస్ట్ అండ్ ప్రెస్ నోట్ ద్వారా ఈ ఘటనపై స్పందించారు… “స్టే ఆర్డర్లు, కోర్టు కేసులకు విరుద్ధంగా ఎస్ కన్వెన్షన్కు సంబంధించి కూల్చివేతలు చేపట్టడం బాధాకరం. మా ప్రతిష్టను కాపాడటం కోసం, కొన్ని వాస్తవాలను తెలియజేయడం కోసం, చట్టాన్ని ఉల్లంఘించేలా మేము ఎటువంటి చర్యలు చేపట్టలేదని తెలుపుట కొరకు ఈ ప్రకటనను జారీ చేయడం సరైనదని నేను అనుకుంటున్నాను అంటూ నాగ్‌ సోషల్ మీడియా ద్వారా తెలిపారు.

Share This Article