ఎలాన్‌ మస్క్‌ కి స్పెషల్‌ రిక్వెస్ట్ పెట్టిన నాగ్‌ అశ్విన్‌!

Sunday, December 22, 2024

పాన్‌ ఇండియా స్టార్‌ హీరో ప్రభాస్‌ నటిస్తున్న మోస్ట్‌ అవైటెడ్‌ సినిమా కల్కి 2898 ఏడీ ఈ సినిమాని మహానటి ఫేమ్‌ నాగ్ అశ్విన్‌ రూపొందిస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమా లో అమితాబ్ బచ్చన్ ,కమల్ హాసన్ వంటి లెజెండరీ స్టార్స్ ముఖ్య పాత్రలు చేస్తున్నారు.  
ఈ సినిమాలో ప్రభాస్ సరసన దీపికా పదుకోన్,దిశా పటాని హీరోయిన్స్ గా   చేస్తున్నారు.

ఈ సినిమాను మేకర్స్ జూన్ 27 న గ్రాండ్ గా విడుదల చేయనున్నారు.దీంతో మేకర్స్ ప్రమోషన్స్ ఇప్పటికే  మొదలు పెట్టారు.  ప్రమోషన్స్ లో భాగంగా ఈ చిత్రం నుండి స్పెషల్ క్యారెక్టర్ అయిన బుజ్జిని ప్రేక్షకులకు పరిచయం చేసారు. బుజ్జి ఎవరంటే.. ఒక రోబోటిక్ కార్ ,అంతే కాదు ఈ సినిమాలో ప్రభాస్ కు క్లోజ్ ఫ్రెండ్ కూడా..ఈ బుజ్జికి మహానటి కీర్తి సురేష్ డబ్బింగ్ చెప్పిన విషయం తెలిసిందే.బుజ్జి పేరు చిన్నగా ఉన్న కూడా ఈ సినిమాలో దీని పాత్ర ఎంతో ప్రత్యేకమని దర్శకుడు నాగ్ అశ్విన్‌ వివరించారు.

కల్కి సినిమా రిలీజ్ ఇంకా కొన్ని వారాలు మాత్రమే ఉండటంతో మేకర్స్ బుజ్జితో స్పెషల్ ప్రమోషన్స్ చేయిస్తున్నారు. దేశంలోని పలు ప్రధాన నగరాల్లో బుజ్జి కారును తిప్పుతూ  ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం బుజ్జి కారు చెన్నై రోడ్లపై సందడి చేస్తున్న బుజ్జి వీడియో బాగా వైరల్ అవుతుంది.

ఈ వీడియోను డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఎలాన్ మస్క్ కు ట్యాగ్ చేశాడు. “ప్రియమైన ఎలన్ మస్క్ సర్. మా బుజ్జిని చూడటానికి, నడపడానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము. ఇది 6 టన్నుల బరువున్న ఎలక్ట్రికల్‌ కారు …ఈ కారు ఓ ఇంజనీరింగ్ అద్భుతం. ఇది మీకు ఒక గొప్ప అనుభూతి ఇస్తుంది” అంటూ నాగ్ అశ్విన్ ట్వీట్ చేశారు.ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్‌ గా మారింది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles