“కల్కి” నుండి నాగ్ అశ్విన్ – దీపికా బీటీఎస్ పోస్టర్‌ విడుదల!

Tuesday, January 21, 2025

రెబల్ స్టార్ ప్రభాస్‌ హీరోగా, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన మైథాలజీ సైన్స్ ఫిక్షన్ సినిమా కల్కి 2898 ఏడీ. జూన్ 27, 2024 న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా థియేటర్లలో విడుదల అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రేక్షకులని, అభిమానులని ఎంతగానో ఆకట్టుకుంటుంది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో ముందుకు దూసుకుపోతున్న ఈ సినిమా వెయ్యి కోట్ల రూపాయల క్లబ్ లో చేరిన సంగతి తెలిసిందే.

ఈ సినిమా నుంచి చిత్రబృందం ఇంట్రెస్టింగ్ కంటెంట్ తో ఆడియెన్స్ ను అలరిస్తూనే ఉన్నారు. సినిమాకి సంబందించిన మరొక ఇంట్రెస్టింగ్ బీటీఎస్ స్టిల్ ను చిత్ర బృందం నేడు విడుదల చేసింది. డైరెక్టర్ నాగ్ అశ్విన్, ఫీమేల్ లీడ్ దీపికా పదుకునే కి సన్నివేశాన్ని వివరిస్తున్న స్టిల్ ఇది.

ఈ స్టిల్‌ ఫ్యాన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటుంది. శంబాల కి దీపికా చేరుకున్న తర్వాత వచ్చే సీన్ అని వారిద్దరూ ఉన్న స్టిల్ ను చూస్తే తెలుస్తుంది. ఈ భారీ బడ్జెట్ సినిమాలో బాలీవుడ్ ముద్దుగుమ్మ దిశా పటాని, లోకనాయకుడు కమల్ హాసన్, బాలీవుడ్ బిగ్‌ బి అమితాబ్ బచ్చన్, బ్రహ్మానందం, రాజేంద్ర ప్రసాద్, శోభన, మాళవిక నాయర్, రౌడీ హీరో విజయ్ దేవరకొండ, మాలీవుడ్‌ నటుడు దుల్కర్ సల్మాన్ తదితరులు కీలక పాత్రల్లో నటించిన సంగతి తెలిసిందే. 

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles