తెలుగు ప్రేక్షకులకు నా ధన్యవాదాలు!

Andhrawatch
1 Min Read

లోక నాయకుడు కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్‌ డైరెక్షన్‌ లో తెరకెక్కుతున్న సినిమా భారతీయుడు 2. హైదరాబాద్ లో నిర్వహించిన భారతీయుడు-2 ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కమల్ హాసన్ ఇంట్రెస్టింగ్ కామెంట్లు  చేశారు. ఈ సందర్భంగా కమల్ హాసన్ మాట్లాడుతూ.. ‘తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు. 52 ఏళ్ల క్రితం నేను మొదటిసారిగా ఓ టెక్నీషియన్ గా హైదరాబాద్ నగరానికి వచ్చాను. అప్పటి నుంచి ఇప్పటివరకు నన్ను ఆదరించిన తెలుగు ప్రేక్షకులకు నా ధన్యవాదాలు అంటూ ఆయన చెప్పుకొచ్చారు.

కె.బాలచందర్, కె.విశ్వనాథ్, శంకర్ వంటి దర్శకులు నాకుఎన్నో మంచి హిట్లు ఇచ్చారు. నన్ను దేశం గర్వించే అంతటివాడిని చేశారు. భారతీయుడు-2 మనందరి సినిమా. ఇక నా దృష్టి అంతా ప్రతిభావంతులను ఇండస్ట్రీకి తీసుకురావడం పైనే ఉంటుంది. నేను రజనీకాంత్  నగేశ్ వంటి వారంతా కూడా గ్రేట్‌ డైరెక్టర్‌ బాలచందర్ గారి వల్లే వెండితెరపై ఇంతకాలంగా రాణిస్తున్నామని” కమల్ హాసన్ చెప్పుకొచ్చారు. ఇక జులై 12, 2024న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Share This Article