నా అకౌంట్‌ హ్యాక్‌ అయ్యింది!

Wednesday, December 18, 2024

గత కొద్ది రోజులుగా ఏదోక కారణంతో వార్తల్లో నిలుస్తున్నారు అక్కినేని నాగచైతన్యం. ఈ క్రమంలో ఆయన నుంచి మరో వార్త తాజాగా అభిమానుల ముందుకు వచ్చింది. అది ఏంటంటే… అక్కినేని నాగచైతన్య ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయినట్టు సమాచారం. తాజాగా ఆయన ట్విట్టర్ అకౌంట్ నుంచి ఒక ట్వీట్ చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

తాను 50 డాలర్లకు వంద బిట్ కాయిన్లను 2013లో కొనుగోలు చేశానని వాటి విలువ ఇప్పుడు ఆరు మిలియన్ డాలర్లు అని ట్విట్‌ చేశారు.  ఇప్పుడు గివ్ ఇవే ఇవ్వాలా వద్దా ఓటు చేయండి అంటూ చైతూనే ట్వీట్ చేసినట్లుగా అందులో ఉంది. ఇప్పటికే చాలామంది ఈ మేరకు ఓటింగ్ కూడా చేస్తున్నారు. కానీ సాధారణంగా ఇలాంటి బిట్ కాయిన్ వ్యవహారాల గురించి ఎక్కువగా హ్యాక్ చేసిన తర్వాత హ్యాకర్లు మాత్రమే ఇలా పోస్ట్ చేస్తూంటారు.

కాబట్టి ఈ ట్విట్టర్ అకౌంట్ కూడా హ్యాక్ అయిందేమో అని అనుమానాలు వస్తున్నాయి. ఇక నాగచైతన్య ట్విట్టర్ అకౌంట్ విషయానికి వస్తే 2.6 మిలియన్ ఫాలోవర్లతో ఈ అకౌంట్ రన్ అవుతోంది. 2017లో నాగచైతన్య ట్విట్టర్ అకౌంట్ తీసుకున్నారు. ఇక నాగచైతన్య సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ఆయన చందు మొండేటి దర్శకత్వంలో తండేల్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్గా నటిస్తోంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles