మ్యూజికల్‌ జీబ్రా!

Thursday, January 23, 2025

మోస్ట్‌ టాలెంటెడ్‌ నటుడు సత్యదేవ్ ముఖ్య పాత్రలో నటిస్తున్న తాజా సినిమా ‘జీబ్రా’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని విడుదలకు రెడీ అయ్యింది. ఈ సినిమాను పూర్తి క్రైమ్ థ్రిల్లర్‌గా చిత్ర యూనిట్ తెరకెక్కించింది. అయితే, దీపావళి కానుకగా విడుదల కావాల్సిన ఈ సినిమాను మేకర్స్ వాయిదా వేశారు.

ఇక నవంబర్ 22న ఈ చిత్రాన్ని గ్రాండ్ గా విడుదల చేస్తున్నట్లు వారు ఇప్పటికే ప్రకటించారు. అయితే, ఈ సినిమా ప్రమోషన్స్‌ను వేగవంతం చేసేందుకు చిత్ర యూనిట్ సిద్దమైంది ఇందులో భాగంగానే ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ సింగిల్ సాంగ్‌ని నవంబర్ 4న ఉదయం 11.11 గంటలకు విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తాజాగా ప్రకటించింది.

ఈ సినిమాకు రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నాడు. డాలి ధనంజయ మరో లీడ్ రోల్ చేస్తున్న ఈ సినిమాలో సత్యరాజ్, ప్రియా భవానీ శంకర్, సునీల్ వంటివారు ముఖ్య పాత్రల్లో చేస్తున్నారు. ఈ సినిమాను ఈశ్వర్ కార్తీక్ డైరెక్ట్ చేస్తున్నాడు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles