చరణ్‌ కోసం రంగంలోకి మున్నా భాయ్‌ !

Friday, January 24, 2025

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన కెరీర్‌లోని 16వ చిత్రాన్ని ‘ఉప్పెన’ చిత్ర దర్శకుడు బుచ్చిబాబు సానాతో తీస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను ఇప్పటికే అధికారికంగా లాంచ్ చేయగా, ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలు పెట్టారు. ఇక ఈ సినిమాను స్పోర్ట్స్ డ్రామా మూవీగా రూపొందిద్దుకుంటుందని వార్తలు వస్తున్నాయి. అయితే, ఈ సినిమాలోని క్యాస్టింగ్‌పై కూడా సినీ సర్కిల్స్‌లో వార్తలు వినిపిస్తున్నాయి.

ఇప్పటికే ఈ సినిమాలో కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్ నటిస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ మూవీలో వర్సటైల్ యాక్టర్ జగపతి బాబు కూడా జాయిన్ అవుతున్నట్లు సమాచారం.అయితే, ఇప్పుడు మరో క్రేజీ యాక్టర్ కూడా ఈ సినిమాలో యాక్ట్‌ చేస్తున్నాడనే టాక్ వినపడుతుంది.

బాలీవుడ్‌లో తెరకెక్కిన బ్లాక్‌బస్టర్ వెబ్ సిరీస్ ‘మీర్జాపూర్’. అందులో మున్నా భయ్యా పాత్రకు ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దేశవ్యాప్తంగా మున్నా భయ్యా పాత్రకు మంచి టాకే వచ్చింది. ఇక ఈ పాత్రలో నటించిన దివ్యేందు శర్మకు సాలిడ్ గుర్తింపు రావడంతో వరుసగా సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు.

కాగా, ఇప్పుడు ఈ క్రేజీ యాక్టర్ ‘RC16’లో కూడా ఓ కీలక పాత్రలో నటించబోతున్నట్లు సినీ సర్కిల్స్‌లో జోరుగా వార్తలు వినపడుతున్నాయి. మరి ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందనే విషయం తెలియాలంటే చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించాల్సిందే ఇక ఈ సినిమాలో అందాల భామ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా చేస్తోంది.

ఇక ఈ సినిమాకు ‘ఫంకీ’ అనే టైటిల్‌ని కూడా ఫిక్స్‌ చేశారని…త్వరలోనే ఈ సినిమాను అధికారికంగా ప్రకటించనున్నారని సమాచారం. ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ ప్రొడ్యూస్ చేస్తున్నట్లు టాక్‌. మరి ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందనేది వేచి చూడాల్సిందే.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles