మాజిరాజు కోసం రంగంలోకి ముఫాసా!

Monday, January 6, 2025

యాంకర్ నుండి హీరోగా మారిన ప్రదీప్ మాచిరాజు నటిస్తున్న తాజా సినిమా ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ ప్రేక్షకుల్లో మంచి బజ్‌ని క్రియేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను నితిన్-భరత్ సంయుక్తంగా డైరెక్ట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా నుండి తాజాగా ఫస్ట్ సింగిల్ సాంగ్‌కు సంబంధించిన ప్రోమోను ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చారు.

లేలే లేలే అంటూ సాగే ఈ మెలోడీ పాటను లెజెండరీ సింగర్ ఉదిత్ నారాయణ్ ఆలపించారు. ఇక రధాన్ ఈ పాటకు మంచి ట్యూన్‌ను కంపోజ్ చేసి అందించాడు. అటు ఈ పాటను శేఖర్ మాస్టర్ అద్భుతంగా కొరియోగ్రఫీ చేసినట్లుగా ప్రోమోలో కనపడుతుంది. అయితే, ఈ పాటను నవంబర్ 27న 4.05 గంటలకు సూపర్ స్టార్ మహేష్ బాబు రిలీజ్ చేసినట్లు చిత్ర బృందం తెలిపింది. మాచిరాజు కోసం ముఫాసా వస్తున్నాడు..అంటూ వారు ట్యాగ్ చేయడంతో అభిమానుల్లో మరింత ఆసక్తి కలుగుతుంది

ఈ సినిమాలో దీపికా పిల్లి హీరోయిన్‌గా నటిస్తోండగా వెన్నెల కిషోర్, సత్య, గెటప్ శ్రీను, మురళీధర్ గౌడ్ ఇతర ముఖ్య పాత్రల్లో చేస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles