మెట్రోలో మిస్టర్‌ బచ్చన్‌ ప్రమోషన్స్‌!

Tuesday, January 21, 2025

మాస్‌ మహారాజా రవితేజ, డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబోలో వచ్చిన మిస్టర్‌ బచ్చన్‌ సినిమా ఆగస్టు 15న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్దమైన సంగతి తెలిసిందే. విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో ఈ సినిమా ప్రమోషన్స్ చాలా వేగంగా జరుగుతున్నాయి. సినిమా ప్రమోషన్ లో భాగంగా అందరిలా కాకుండా మిస్టర్ పర్చన్ టీం కాస్త వెరైటీగా ఆలోచించి సినిమా ప్రమోషన్స్‌ మొదలు పెట్టింది.  ఇందులో భాగంగా రవితేజ వాయిస్ మెసేజ్ ను ఉపయోగించి ప్రమోషన్ ను ఓ రేంజ్ లో మొదలు పెట్టేసింది. ఇక ప్రమోషన్ సంబంధించి తాజాగా చిత్ర బృందం హైదరాబాద్ మెట్రో ట్రైన్స్‌ను  ఎంపిక చేసుకుంది.

మెట్రో ప్రయాణికులకు స్వాగతం.. సుస్వాగతం.. అంటూ.., ఏం తమ్ముళ్లు.. మెట్రోలో ప్లేస్ దొరకలేదా.? లేకుంటే కూర్చోగానే లేపేస్తున్నారా.? అయినా పర్లేదు.. మిస్టర్ బచ్చన్ నుండి లేటెస్ట్ గా పాట విడుదల అయింది.. హ్యాపీగా వినుకుంటూ నిల్చొని మీరు దిగాల్సిన స్టేషన్ వచ్చేదాకా వెళ్లండి అంటూనే.. ఇక్కడ సీటు దొరకపోయినా పర్లేదు.. ఆగస్టు 15న సినిమా థియేటర్ కు వచ్చేయండి అక్కడ మాత్రం సీటు గ్యారెంటీ అంటూ హీరో రవితేజ వాయిస్ మెసేజ్ తో ప్రయాణికులకు సర్ప్రైజ్ ఇచ్చారు మూవీ మేకర్స్.

ఈ వాయిస్ మెసేజ్ వింటున్న మెట్రో ప్రయాణికుల హావభావాలకు సంబంధించిన కొన్ని వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదల అయిన టీజర్, పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందనే వచ్చింది. 

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles