రొమాంటిక్‌ మూడ్‌ లో మిస్టర్‌ బచ్చన్‌!

Sunday, December 22, 2024

మాస్ మహా రాజా రవితేజ లేటెస్ట్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘మిస్టర్ బచ్చన్’ సినిమా ప్రేక్షకుల్లో సాలిడ్ అంచనాలను క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు హరీష్ శంకర్ డైరెక్ట్ చేస్తుండగా అందాల భామ భాగ్యశీ బొర్సె  హీరోయిన్‌గా యాక్ట్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే విడుదలైన రెండు పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి సాలిడ్ రెస్పాన్స్ దక్కింది.

‘సితార్’ అంటూ సాగిన మెలోడియస్ పాట.. ‘రెప్పల్ డప్పుల్’ అంటూ వచ్చిన మాస్ మసాలా సాంగ్ అభిమానులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా నుంచి ‘జిక్కీ’ ‘జిక్కీ’ అనే రొమాంటిక్ సాంగ్‌ను విడుదల చేయనున్నట్లు  మేకర్స్ తాజాగా తెలిపారు. దీనికి సంబంధించి ఓ పోస్టర్ కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చారు. భాగ్యశ్రీ నడుముపై మాస్ రాజా ముద్దుపెడుతున్న పోస్టర్ ఈ పాట ఎలాంటి రొమాంటిక్ ఫీల్‌తో రాబోతుందో  చెప్పకనే చెబుతుంది.

ఇక ఈ పాటను ఆగస్టు 2న విడుదల చేస్తున్నట్లు మూవీ మేకర్స్‌ వెల్లడించారు. ‘‘ఈ రొమాంటిక్ పాట మీ ప్లేలిస్ట్‌లో టాప్‌గా నిలుస్తుంది’’ అంటూ మూవీ మేకర్స్ చెప్పుకొచ్చారు. ఈ సినిమాను ఆగస్టు 15న విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles