రవితేజ నెక్ట్స్‌ సినిమాలో మిస్టర్ బచ్చన్‌ సెలబ్రేషన్స్‌!

Friday, March 14, 2025

మాస్‌ మహారాజా రవితేజ తాజాగా నటించిన మిస్టర్‌ బచ్చన్ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలై థియేటర్లలో సందడి చేస్తోంది ఈ సినిమాకు మిక్సిడ్ టాక్ రావడంతో మాస్ ఆడియెన్స్ ఈ సినిమాను చూసేందుకు ఆసక్తిని చూపిస్తున్నారు. లాంగ్ వీకెండ్‌లో ఈ సినిమా పుంజుకుంటుందని మూవీ మేకర్స్ అనుకుంటున్నారు.

ఇక ఈ సినిమాకు మంచి విజయాన్ని అందించిన అభిమానులకు ‘మిస్టర్ బచ్చన్’ టీమ్ధ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది. తమ సక్సెస్ సెలబ్రేట్ చేసుకునేందుకు దర్శకుడు హరీష్ శంకర్ ,  హీరోయిన్ భాగ్యశ్రీ బొర్సె తమ హీరో వద్దకు వెళ్లారు. రవితేజ ప్రస్తుతం తన కొత్త సినిమా షూటింగ్‌లో ఫుల్ బిజీగా ఉన్నాడు. దీంతో ఆయన్ను నేరుగా కలిసేందుకు ఆ షూటింగ్ సెట్స్‌లో ప్రత్యక్షమయ్యారు మిస్టర్ బచ్చన్ డైరెక్టర్ అండ్ కథానాయిక. తమ ఆనందాన్ని ఆయనతో కలిసి ఎంజాయ్ చేశారు.

దీనికి సంబంధించిన వీడియో గ్లింప్స్‌ను చిత్ర యూనిట్ సోషల్ మీడియాలో పంచుకుంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : admin@andhrawatch.com

Latest Articles