యంగ్ హీరో తేజ సజ్జ, రితికా నాయక్ జంటగా నటిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ “మిరాయ్” సినిమా మీద ఊహించని స్థాయిలో హైప్ క్రియేట్ అవుతోంది. దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి తాజాగా విడుదలైన ట్రైలర్ సెన్సేషన్ గా మారింది. మైండ్ బ్లోయింగ్ విజువల్స్ తో పాటు పవర్‌ఫుల్ యాక్షన్ సీన్స్ కనిపించడంతో ప్రేక్షకులలో బజ్ మరింత పెరిగింది.
ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే ట్రైలర్ లో కనిపించిన డివోషనల్ టచ్ ఆడియెన్స్ కి కనెక్ట్ అయ్యింది. దాంతో సినిమా మీద అంచనాలు రెట్టింపయ్యాయి. ఇకపోతే కార్తీక్ ఘట్టమనేని స్టైల్ కి ఫ్యాన్ అయిన వాళ్లు ఈ సినిమా కోసం మరింత ఎగ్జైట్ అవుతున్నారు. గతంలో ఆయన రవితేజతో చేసిన “ఈగల్” అనుభవం గుర్తున్న ప్రేక్షకులు ఇప్పుడు మిరాయ్ కోసం కౌంట్‌డౌన్ మొదలుపెట్టారు.
