టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న పూజా హెగ్డే, ఇప్పుడు కోలీవుడ్‌లో కూడా తనకంటూ మంచి క్రేజ్ సంపాదించుకుంది. కొంతకాలంగా సినిమాల నుంచి దూరంగా ఉన్న ఆమె, మళ్లీ కొత్త ఊపుతో సిల్వర్‌స్క్రీన్‌పై కనిపిస్తోంది. తాజాగా విడుదలైన “కూలీ” సినిమాలో స్పెషల్ సాంగ్‌లో తన గ్లామరస్ అట్రాక్షన్‌తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది.
ఇక ఇప్పుడు పూజా గురించి మరో ఇంట్రెస్టింగ్ వార్త ఫిలిం సర్కిల్స్‌లో హల్‌చల్ చేస్తోంది. ఆమె త్వరలో ఓటిటి ప్రపంచంలోకి అడుగుపెట్టబోతోందని టాక్ వినిపిస్తోంది. నెట్‌ఫ్లిక్స్ ప్లాట్‌ఫారమ్‌లో రూపొందుతున్న ఓ వెబ్ సిరీస్‌లో ఆమె ప్రధాన పాత్రలో కనిపించే అవకాశం ఉందట. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన వివరాలు ఇంకా బయటకు రాకపోయినా, ఇండస్ట్రీలో మాత్రం ఇది పెద్ద చర్చగా మారింది.
ప్రస్తుతం పూజా హెగ్డే, “జన నాయకుడు”, “కాంచన 4” వంటి ఆసక్తికరమైన సినిమాల్లో నటిస్తోంది.
