మోక్షఙ మేకోవర్‌ !

Wednesday, December 18, 2024

బాలయ్య హీరోగా ఎంట్రీకోసం సీనియర్‌ ఎన్టీఆర్‌ ఫ్యాన్స్ ఎంతగా ఎదురు చూసారో నేడు అయన వారసుడు ఎంట్రీ కోసం నందమూరి బాలయ్య ఫ్యాన్స్ అంతకంటే ఎక్కువ ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. అటు వైపు మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోగా ఎదగడం చకచక జరిగిపోయిన సంగతి తెలిసిందే. మరొక స్టార్ హీరో అక్కినేని నాగార్జున వారసులు నాగ చైతన్య, అఖిల్ టాలీవుడ్ లో హీరోలుగా కొనసాగుతున్నారు.

వాస్తవానికి బాలయ్య వారసుడు నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ ఎప్పుడో ఉండాల్సి ఉంది. లెజెండ్ సినిమా వచ్చినప్పటి నుండి అదుగో వస్తున్నాడు ఇదిగో వస్తున్నాడు అనడమే తప్ప ఆ మాట మాత్రం నిజం అవ్వలేదు. కాగాఇన్నేళ్లకు నందమూరి అభిమానుల నిరీక్షణకు తెరపడింది. మోక్షజ్ఞ సిల్వర్ స్క్రీన్ పై మెరిసే టైమ్‌ రానే వచ్చింది. హనుమాన్ చిత్ర దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టబోతున్న సంగతి తెలిసిందే.

బాలయ్య చిన్న కుమార్తె మతుకుమిల్లి తేజస్విని ఈ మూవీని నిర్మించనున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది.
కాగా ఇటీవల మోక్షు లేటెస్ట్ ఫొటోస్ లీక్ అవగా అవి నెట్టింట వైరల్అవుతున్న సంగతి తెలిసిందే. తాజగా మోక్షు వీడియో ఒకటి రిలీజ్ అవ్వగా నెట్టింట వైరల్ అవుతుంది. వీడియో లో స్లిమ్ గా, కూలింగ్ గ్లాస్ పెట్టిన సింహం లాంటి చూపుతో నిలబడి ఉన్న మోక్షజ్ఞ కనిపిస్తున్నాడు.  అక్టోబరులో మోక్షజ్ఞ చిత్రం షూటింగ్ ప్రారంభం కానుంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles