యంగ్ హీరో తేజ సజ్జ నటించిన కొత్త చిత్రం “మిరాయ్”తో మరోసారి టాలీవుడ్‌లో ప్రత్యేకమైన యాక్షన్ విజువల్ ఫీస్ట్ అందింది. హనుమాన్ సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్న దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని, ఈ సారి కూడా అదే రేంజ్ కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. రిలీజ్‌కి ముందు నుంచే ఈ సినిమాపై అంచనాలు ఎక్కువగా ఉండగా, థియేటర్లలోకి వచ్చిన వెంటనే వాటిని నిలబెట్టుకుంది.
వరల్డ్ వైడ్ ఓపెనింగ్స్ విషయానికొస్తే మిరాయ్‌కి మంచి రెస్పాన్స్ లభించింది. తెలుగు వెర్షన్ మాత్రమే కాదు, హిందీ మార్కెట్‌లో కూడా ఈ సినిమాపై ఆసక్తి కనిపిస్తోంది. హనుమాన్ విడుదల సమయంలో ఎలా వసూళ్లు వచ్చాయో, ఇప్పుడు మిరాయ్‌కీ అలాంటి పరిస్థితి నెలకొంది అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
హనుమాన్ మొదటి రోజు దాదాపు 2 కోట్ల నెట్ వసూళ్లు సాధించగా, మిరాయ్ కూడా ఆ స్థాయికి దగ్గరగా చేరుకుంది. మొదటి రోజు మిరాయ్ 1.7 కోట్ల నెట్ కలెక్షన్‌తో మంచి ఆరంభం సాధించింది. ఈ స్టార్ట్ చూస్తుంటే రాబోయే రోజుల్లో మిరాయ్ వసూళ్లు ఇంకా పెరగవచ్చని అంచనా వేస్తున్నారు.
