యంగ్ హీరో తేజ సజ్జా ‘హను-మాన్’ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయాడు. ఆ సినిమా ఇచ్చిన విజయం ఆయనకి పెద్ద స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చింది. ఇప్పుడు అదే జోష్‌తో వరుసగా కొత్త సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నాడు. ప్రస్తుతం తేజ నటిస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ సినిమా పేరు ‘మిరాయ్’.
ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం, ముంబైలోని పురాతన గుహల్లో కొత్త షెడ్యూల్ మొదలైంది. ఈ భాగంలో తేజతో పాటు మరికొందరు కీలక నటీనటులు పాల్గొంటున్నారు. అక్కడ కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించేందుకు చిత్రబృందం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.
ఇక ఈ సినిమాలో మరో స్పెషల్ అట్రాక్షన్ మంజు మనోజ్. ఆయన ఒక నెగిటివ్ పాత్రలో కనిపించనున్నాడు. ‘బ్లాక్ స్వార్డ్’ అనే డార్క క్యారెక్టర్‌లో మనోజ్ కనిపించబోతున్నట్టు సమాచారం. ఇప్పటికే ఆయన పాత్రకు సంబంధించిన పోస్టర్లు ప్రేక్షకులలో మంచి ఉత్సాహన్ని పెంచాయి.
