ఈ సెప్టెంబర్ లో థియేటర్లలోకి అడుగుపెట్టబోతున్న పెద్ద సినిమాల్లో టాలీవుడ్ నుంచి కూడా కొన్ని చిత్రాలు ప్రత్యేక అట్రాక్షన్ గా మారాయి. వాటిలో తేజ సజ్జ, మంచు మనోజ్ ముఖ్యపాత్రల్లో నటించిన మిరాయ్ కూడా ఒకటి. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ ట్రైలర్ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి కలిగించింది.
ఇటీవల ఈ ట్రైలర్‌ని సూపర్ స్టార్ రజినీకాంత్‌కు చూపించినట్లు మంచు మనోజ్ సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు పంచుకున్నాడు. ఆ స్టిల్స్ లో రజినీకాంత్ సీరియస్ గా ట్రైలర్ చూస్తుండగా, మనోజ్ మాత్రం పక్కనే చిరునవ్వుతో నిలబడి ఉండటం అభిమానులను ఆకట్టుకుంది. ఈ క్షణాన్ని ఎంతో స్పెషల్‌గా ఫీల్ చేసిన మనోజ్, తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ రాబోతున్న శివకార్తికేయన్ మదరాసి చిత్రానికి కూడా శుభాకాంక్షలు తెలియజేశారు.
