టాలీవుడ్ నుంచి ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన హిట్ సినిమాల్లో హీరో తేజ సజ్జ నటించిన మిరాయ్ కూడా ఒకటి. రితికా నాయక్ హీరోయిన్ గా నటించగా, కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఈ సినిమా అడ్వెంచర్ అండ్ ఫ్యాంటసీ అంశాలతో తెరకెక్కింది. హను మాన్ తర్వాత తేజ సజ్జ కెరీర్ లో మరో పెద్ద విజయాన్ని అందించిన చిత్రంగా ఇది గుర్తింపు పొందింది.
థియేటర్లలో ఇంకా బలమైన రన్ కొనసాగిస్తున్నప్పటికీ, ఈ సినిమా డిజిటల్ రిలీజ్ కి సిద్ధమైంది. మిరాయ్ స్ట్రీమింగ్ హక్కులు జియో హాట్ స్టార్ దగ్గర ఉన్నాయి. ఇప్పుడు వారు అధికారికంగా స్ట్రీమింగ్ డేట్ ని ప్రకటించారు. తెలుగు మాత్రమే కాకుండా తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో కూడా ఈ సినిమా అక్టోబర్ 10 నుంచి హాట్ స్టార్ లో చూడొచ్చు.
