సాలిడ్‌ బుకింగ్స్‌ తో దూసుకుపోతున్న మిరాయ్‌!

Friday, December 5, 2025

యంగ్ హీరో తేజ సజ్జ ప్రధాన పాత్రలో, మంచు మనోజ్ విలన్‌గా నటించిన భారీ యాక్షన్ ఎంటర్టైనర్ “మిరాయ్”పై ప్రేక్షకుల్లో మంచి హంగామా కొనసాగుతోంది. ఈ సినిమాను “ఈగల్”తో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని డైరెక్ట్ చేయడం సినిమాపై మరింత అంచనాలు పెంచింది.

సినిమా ప్రమోషన్స్ కూడా బలంగా నడుస్తుండటంతో ఆ ఎఫెక్ట్ బుకింగ్స్‌లో స్పష్టంగా కనిపిస్తోంది. బుక్ మై షోలో గంట గంటకు ట్రెండింగ్ లిస్టులో “మిరాయ్” హాట్ టాపిక్‌గా నిలుస్తూ హైప్‌ను మరింత పెంచుతోంది. నిన్నటి నుంచే మొదలైన ఈ బజ్‌ ఇప్పుడు కూడా కొనసాగుతుండటంతో సినిమాకి భారీ ఓపెనింగ్స్ ఖాయం అని ట్రేడ్ టాక్ వినిపిస్తోంది.

ఈ చిత్రంలో రితిక నాయక్ హీరోయిన్‌గా నటించగా, “హను మాన్”కు సంగీతం అందించిన గౌర హరి ఈ సినిమాకి కూడా మ్యూజిక్ అందించారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles