యంగ్ హీరో తేజ సజ్జ ప్రధాన పాత్రలో, రితికా నాయక్ హీరోయిన్‌గా నటించిన తాజా చిత్రం మిరాయ్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాను కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించగా, రిలీజ్ కి ముందు నుంచే మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే సినిమా రన్ అవుతూ, తేజ సజ్జ కెరీర్‌లో హను మాన్ తర్వాత మరో సక్సెస్‌గా నిలిచింది.
థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శనలు పూర్తి చేసుకున్న తర్వాత, ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. జియో హాట్ స్టార్ ఈ చిత్రానికి స్ట్రీమింగ్ హక్కులు సొంతం చేసుకుంది. ప్రస్తుతం హిందీ మినహా ఇతర ముఖ్యమైన భాషల్లో ప్రేక్షకులు ఈ సినిమాను అక్కడ చూడవచ్చు.
మిరాయ్ సినిమాలో గౌర హరి సంగీతం సమకూర్చగా, మంచు మనోజ్ విలన్ పాత్రలో ఆకట్టుకున్నారు. ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మించింది.
