రాజాసాబ్ కోసం వస్తున్న మిల్కీ బ్యూటీ!

Friday, December 5, 2025

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా సినిమా ‘ది రాజాసాబ్’ ఎప్పుడో మొదటి అనౌన్స్‌మెంట్‌ నుంచే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు క్రియేట్ చేసింది. దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఒక హారర్ కామెడీ జోనర్‌గా రూపొందుతుంది. ఇప్పటివరకు విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్‌లతో ఈ మూవీపై ఆసక్తి మరింత పెరిగింది.

ఇలాంటి సమయంలో ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది. రాజాసాబ్ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ ప్లాన్ చేశారట. ఆ సాంగ్ కోసం ఎవరిని ఎంపిక చేయాలా అని చిత్ర బృందం చాలా మంది హీరోయిన్ల పేర్లను పరిశీలించింది. అయితే తాజా సమాచారం ప్రకారం మిల్కీ బ్యూటీ తమన్నాను ఈ స్పెషల్ సాంగ్ కోసం ఫైనల్ చేశారని వార్తలు వినపడుతున్నాయి.

తమన్నా ప్రస్తుతం బాలీవుడ్‌లో స్పెషల్ సాంగ్స్‌లో ఎక్కువగా కనిపిస్తూ అక్కడ మంచి క్రేజ్ దక్కించుకుంది. అలాంటి ఆమె ఇప్పుడు తెలుగు ప్రేక్షకులకు మళ్లీ మ్యూజికల్ ట్రీట్ ఇవ్వబోతుందన్న మాట. గతంలో ప్రభాస్‌తో ఆమె నటించిన ‘రెబల్’, ‘బాహుబలి’ సిరీస్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించాయి. ఇప్పుడు మళ్లీ వీరిద్దరి కాంబినేషన్‌లో ఓ ప్రత్యేక గీతం వస్తుందన్న మాట అభిమానుల్లో ఆసక్తిని రేపుతోంది.

ఇక నిజంగా తమన్నా ఈ స్పెషల్ సాంగ్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా లేక ఇంకా చర్చల దశలో ఉందా అనేది అధికారిక సమాచారం వచ్చే వరకు వేచి చూడాల్సిందే. కానీ ఈ రూమర్‌తో మాత్రం సినిమాపై హైప్ ఇంకా పెరిగిందన్నది మాత్రం నిజం.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles