అక్కినేని నాగచైతన్య నటిస్తున్న తాజా సినిమా ‘తండేల్’ ప్రేక్షకుల్లో సాలిడ్ అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు చందు మొండేటి డైరెక్ట్ చేస్తుండటంతో ఈ మూవీపై మంచి బజ్ క్రియేట్ చేసింది. ఇక ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్, సాంగ్స్ ఈ మూవీపై మరిన్ని అంచనాలు పెంచేశాయి.
అయితే, ఇప్పుడు ఈ సినిమా నుంచి మరో అప్డేట్ ఇచ్చేందుకు మేకర్స్ సిద్దమవుతున్నారు. ఈ సినిమాలోని మూడో సింగిల్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేసేందుకు రెడీ అవుతున్నారు. ‘హైలెస్సో హైలెస్స’ అంటూ సాగే ఈ పాట మెలోడీగా రానుందని మేకర్స్ వెల్లడించారు.
ఈ పాటను మెలోడీ క్వీన్ శ్రేయా ఘోషల్‌తో పాటు అజీజ్ నాకాష్ కలిసి పాడారు. ఈ పాటను జనవరి 23న విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ తాజాగా ప్రకటించారు. ఇక ఈ సినిమాలో అందాల భామ సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తుండగా రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు.