చేతిలో ఒలింపిక్‌ టార్చ్ తో మెగాస్టార్‌!

Saturday, January 18, 2025

టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా త్రిష హీరోయిన్ గా దర్శకుడు వశిష్ఠ తెరకెక్కిస్తున్న అవైటెడ్ ఫాంటసీ డ్రామా “విశ్వంభర” గురించి అందరికీ తెలిసిందే. ఈ చిత్రాన్ని దాదాపు పూర్తి చేసిన మెగాస్టార్ ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకొని ఫ్యామిలీతో లండన్, ప్యారిస్ వెకేషన్ కి వెళ్లారు.

మొన్ననే వారసుడు రామ్ చరణ్, మనవరాలు క్లిన్ కారా అలాగే మెగా కోడలు ఉపాసన, తన భార్య సురేఖతో కలిసి కనిపించిన చిరు ఈసారి ప్యారిస్ లో జరుగుతున్న ఒలింపిక్ ఆరంభోత్సవానికి హాజరు అవుతున్నట్టుగా తెలిపారు. అయితే అక్కడ నుంచి మెగాస్టార్ ఓ ఇంట్రెస్టింగ్ పిక్ ని అభిమానులతో షేరు చేసుకున్నారు.

ఒలింపిక్స్ ఆరంభోత్సవానికి హాజరు కావడం ఎంతో థ్రిల్లింగ్ గా ఉందని అలాగే ప్రఖ్యాత ఒలింపిక్ టార్చ్ ని నా భార్య సురేఖతో కలిసి పట్టుకోవడం ఒక మధురానుభూతిగా నాకు మిగిలిపోయింది అంటూ చెప్పుకొచ్చారు.  అలాగే ఇండియా నుంచి వెళ్లిన ప్రతీ క్రీడాకారునికి తన అభినందనలు తెలియజేశారు. అంతే కాకుండా వారికి మరింత ఉత్సాహాన్నిస్తూ జై హింద్ అంటూ పోస్ట్ చేశారు. ఇక ఇందులో కౌ బాయ్ హ్యాట్ లో కనిపించిన చిరు లుక్ మరింత వైరల్ అవుతుంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles