‘మట్కా’ ట్రైలర్ కోసం వస్తున్న మెగాస్టార్

Tuesday, December 3, 2024

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న తాజా సినిమా ‘మట్కా’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని విడుదలకు సిద్దంగా ఉంది. ఈ సినిమాను దర్శకుడు కరుణ కుమార్ తెరకెక్కిస్తుండగా పూర్తి పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ లాంచ్‌ను నవంబర్ 2న నిర్వహిస్తున్నట్లు మేకర్స్ ఇప్పటికే అనౌన్స్ చేశారు.

అయితే, ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కి వెన్యూతో పాటు గెస్టుని కూడా మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమా ట్రైలర్ లాంచ్‌ను హైదరాబాద్‌లోని పార్క్ హయత్‌లో నవంబర్ 2న ఉదయం 10 గంటల నుండి జరగనుందని చిత్ర బృందం తెలిపింది. ఇక ఈ ట్రైలర్ లాంచ్‌కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా రానున్నట్లు చిత్ర బృందం తెలిపింది

దీంతో ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌పై మెగా ఫ్యాన్స్‌లో ఓ రేంజ్‌ లో ఆసక్తి క్రియేట్ అయ్యింది. ఇప్పటికే విడుదల ‘మట్కా’ మూవీ పోస్టర్స్, టీజర్, సాంగ్స్‌కి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్‌ అందింది. దీంతో  ఈ మూవీ ట్రైలర్‌కి కూడా సాలిడ్ రెస్పాన్స్ రావడం ఖాయమని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను నవంబర్ 14న గ్రాండ్ విడుదలకు సిద్దం అవుతున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles