బాస్‌ మూవీ మరింత ఆలస్యం!

Tuesday, March 25, 2025

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘విశ్వంభర’ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చిరంజీవి నుంచి వస్తున్న ఈ సోషియో ఫాంటసీ మూవీతో మెగాస్టార్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి విజయాన్ని అందుకుంటాడా అని అందరూ ఆతృతగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాను దర్శకుడు వశిష్ఠ డైరెక్ట్ చేస్తున్నాడు.

అయితే, ఈ సినిమాను తొలుత సంక్రాంతి 2025 కానుకగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. కానీ, సినిమా వర్క్ ఇంకా పూర్తి కాకపోవడం, ‘గేమ్ ఛేంజర్’ మూవీ రిలీజ్ కారణంతో ‘విశ్వంభర’ రిలీజ్ వాయిదా వేశారు. దీంతో ఈ సినిమాను వేసవి కానుకగా రిలీజ్ చేస్తామంటూ మేకర్స్ చెప్పుకొచ్చారు. కానీ, ఇప్పుడు ఈ మూవీ రిలీజ్ మరింత ఆలస్యం కానున్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమాకు సంబంధించిన వీఎఫ్ఎక్స్ పనులు ఆలస్యం అవుతుండటం దీనికి కారణంగా తెలుస్తోంది. వీఎఫ్ఎక్స్ అవుట్‌పుట్ ఆశించిన మీర లేకపోవడంతో ఈ ప్రాజెక్ట్ ఆలస్యం అవుతుందట. అటు ఈ చిత్ర నిర్మాతలు ఈ మూవీకి సంబంధించిన డిజిటల్ రైట్స్‌ను వీలైనంత ఫ్యాన్సీ రేటుకు విక్రయించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ కారణాలతో ‘విశ్వంభర’ అనుకున్న సమయం కంటే ఎక్కువ ఆలస్యం అవుతుంది. త్రిష హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తోంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : admin@andhrawatch.com

Latest Articles